
అర్జీలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
211 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజిఆర్‌ఎస్)వేదికలో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అధ్యక్షత వహించి జిల్లా నలుమూలలు నుంచి వచ్చిన వారిచే 211 అర్జీలు స్వీకరించారు. కలెక్టరు మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీదారుని సంతృప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కారతీరు వుండాలని స్పష్టం చేశారు. డీఆర్‌ఓ ఏకా మురళి, ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.