
మోసాలను ఎండగడతాం
కూటమి నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు నెల నెలా ఇస్తామన్న రూ.3 వేల భృతిని వెంటనే అందరికీ మంజూరు చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బకాయి పడ్డ డబ్బులను కూడా వారి ఖాతాలలో జమ చేయాలి. కూటమి సర్కార్ యువతను మోసగిస్తున్న తీరును ఎండగట్టి వారి తరఫున పోరాడేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో నేడు యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
– కందుల శ్రీకాంత్, వైఎస్సార్‌సీపీ
యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు