పారాదీప్ పోర్టు బెర్త్ వద్ద ఓడలో మంటలు
భువనేశ్వర్: బొగ్గు రవాణా చేస్తున్న ఓడలో మంటలు చెలరేగాయి. పారాదీప్ పోర్టు బెర్త్ వద్ద ఆదివారం ఈ సంఘటన జరిగింది. చైన్నెరాధ బెర్త్ వద్ద థర్మల్ బొగ్గును కన్వేయర్ బెల్ట్‌పై బొగ్గును లోడ్ చేస్తుండగా ఎకో కొలెనల్ మోనోరివా అనే ఓడలో అగ్ని ప్రమాదం కారణంగా ఓడను సీక్యూ – 2 బెర్త్‌కు తరలించి ఓడ నుంచి బొగ్గును దించారు. నిర్వహణ లోపంతో మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
● శ్రీ జగన్నాథునికి తొలి ఆహ్వానం
భువనేశ్వర్: కటక్ బారాబటి స్టేడియం వేదికగా ఈ నెల 9న భారత దేశం, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఈ మేరకు సన్నాహాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మ్యాచ్ నిర్వాహక సంస్థ ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ) కార్యదర్శి సంజయ్ బెహెరా ఆదివారం పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మ్యాచ్ నిర్వహణ విజయవంతం కావాలని కోరుతూ పూరీ శ్రీ జగన్నాథుని సోదర సోదరీ సమేతంగా ప్రత్యక్షం కావాలని ఆహ్వానించారు. మ్యాచ్ తొలి టికెట్‌ను శ్రీ జగన్నాథుడి పాదాలకు అంకితం చేశారు. మ్యాచ్ సజావుగా సాగి టీం ఇండియా విజయం సాధించాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. బారాబటి స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవుతాయన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తొలి టికెట్ కొనుగోలు చేయడంతో అమ్మకాలు ప్రారంభం అవుతాయి.
వరపుత్రుల విగ్రహాలు ఆవిష్కరణ
రాయగడ: Ð]l$à-ç³#-Æý‡$-çÙ$yýl$ rMýSPÆŠ‡ º´ëµ 126 fĶæ$…-†° ç³#Æý‡-çÜPÇ…-^èl$MýS$° hÌêÏÌZ° Æ>Ð]l$-¯]lVýS$yýl çÜÑ$† ´ëË$-´ëƇ$$ {糿¶æ$™èlÓ »êÍMýSÌS E¯]l²™èl ´ëuý‡-Ô>ÌS {´ë…VýS-׿…ÌZ Ð]l$à-ç³#-Æý‡$-çÙ$ÌS Ñ{VýS-àÌS BÑçÙP-Æý‡×æ M>Æý‡Å-{MýSÐ]l$… Ôèæ°-ÐéÆý‡… fÇW…¨. D M>Æý‡Å-{MýSÐ]l*°MìS Ð]l¬QÅ-A-†-¤V> hÌêÏ çÜ…„óSÐ]l$ Ô>Q A«¨M>Ç BïÜ-Ð]l*-Æ>ÐŒæ àfÆý‡-Ķæ*ÅÆý‡$. çÜïßæ§Šæ ÌS„ýSÃ×Šæ ¯éĶæ$MŠS, çÜ$¿ê‹Ù ^èl…{§ýl-»Z‹Ü, E™èlP-âýæ-Ð]l$×ìæ Vö糺…«§ýl$ §é‹Ü, E™èlP-âýæVúÆý‡ÐŒæ Ð]l$«§ýl$çÜ*-§ýl¯ŒS §é‹Ü Ñ{VýS-à-ÌS¯]l$ BÑ-çÙP-Ç…-^éÆý‡$. ™éÅVýS-ç³#Æý‡$-çÙ$ÌS õÜÐ]l-ÌS¯]l$ D çÜ…§ýlÆý‡Â…V> Mö°-Ķæ*-yéÆý‡$. VýS$׿$-ç³NÆŠ‡ çÜÐ]l${VýS WÇ-f-¯é-À-Ð]l–Šి§ýl® çÜ…çܦ BǦMýS ÝëĶæ$…™ø Ñ{VýS-à-ÌS¯]l$ Æý‡*´÷…¨…^éÆý‡$. E´ë-«§éÅ-Ķæ¬Ë$, ѧéÅ-Æý‡$¦Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
ప్రత్యామ్నాయ పంటలపై
దృష్టి పెట్టాలి
రాయగడ: మాదక ద్రవ్యాలైన గంజాయి వంటి సాగులకు స్వస్తిచెప్పి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా చైతన్య పరచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశించారు. ఆదివారం వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, గుణుపూర్ సబ్ కలెక్టర్ దుదూల్ అభిషేక్ అనిల్, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో అక్రమంగా గంజాయి సాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోందని, దీనిని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు, అబ్కారీ శాఖ నిర్విరామంగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. గంజాయి అక్రమ రవాణా, సాగుపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
పారాదీప్ పోర్టు బెర్త్ వద్ద ఓడలో మంటలు
పారాదీప్ పోర్టు బెర్త్ వద్ద ఓడలో మంటలు


