మాదక ద్రవ్య విముక్తిపై ప్రచారం
రాయగడ: బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్వ విముక్తిపై ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, యువతీ యువకులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత తమ బంగారు భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటుందని అందువల్ల యువతకు మేల్కొపేందుకు ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని డాక్టర్ సునీల్ కుమార్ మహాపాత్రో అన్నారు. స్థానిక కపిలాస్ కూడలి నుంచి ప్రారంభమైన ర్యాలీ తేజస్వీ మైదానం వరకు కొనసాగింది. విద్యార్థులు, యువతీ,యువకులు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. బజరంగ్ దళ్ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలను నిర్వాహకులు అందజేశారు.
మాదక ద్రవ్య విముక్తిపై ప్రచారం


