ఉత్సాహంగా పాటల పోటీలు
రాయగడ: డిసెంబర్ ఏడో తేదీన జరగనున్న స్పందన సాహితీ, సాంస్కృతిక సంస్థ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వాగత్ లైన్‌లోని శ్రీకోదండ రామ మందిరం ప్రాంగణంలో ఆదివారం పాటల పోటీలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు గుడ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లొ యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ విభాగంలో బి.గౌరి శంకరరావు ప్రథమ, పి.కళ్యాణి ద్వితీయ, జి.నాగేశ్వరరావు తృతీయ బహుమతులను సాధించారు. అలాగే జూనియర్ విభాగంలో శుభంకర్ ప్రధాన్ ప్రథమ, ఆకాశ రంజన్ పాడి ద్వితీయ, శ్రీయశ్రీ తృతీయ బహుమతిలను గెలుపొందగా.. హసిని పాత్రో, ముస్తాన్ దత్తలు ప్రోత్సాహక బహుతులు గెలుచుకున్నారు. పొటీలకు న్యాయనిర్ణేతలుగా పార్వతీపురం వాస్తవ్యులు, ప్రముఖ గాయకుడు రమణ పాత్రో, శాంతిమూర్తి, రాజ్‌కుమార్ వ్యవహరించారు. విజేతలకు స్పందన సంస్థ వార్షికోత్సంవలో బహుతులు ఇవ్వనున్నట్లు సాంస్కృతిక విభాగం కార్యదర్శి కె.కె.ఎం.పట్నాయక్ తెలిపారు.


