20 ఎకరాల్లో గంజాయి ధ్వంసం
జయపురం: అబ్కారీ విభాగ సిబ్బంది, పోలీసుల సహాయంతో లమతాపుట్ సమితి మాచ్‌ఖండ్ పోలీసు స్టేషన్ పరిధి సిక్రెల్, ముండాపుట్, ప్రాంతాల అడవిలో 20 ఎకరాల్లో పండిస్తున్న గంజాయి మొక్కలను కోసి వేసినట్లు అబ్కారి అధికారి అరుణకుమార్ పాడి తెలిపారు. సిక్రెల్, ముండాపుట్ అడవుల్లో జోరుగా గంజాయి సాగు జరుగుతుందన్న సమాచారం అందగా శనివారం మధ్యాహ్నం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో కలసి వెళ్లి ఆయన సమక్షంలో గంజాయి పండిస్తున్న అడవిలో దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. మాచ్‌ఖండ్ పోలీసు అధికారి మధుసూధన భొయి నందపూర్ అబకారి విభాగ అధికారి అజయకుమార్ నాయిక్లతో ఏర్పాటు చేసిన ఇక టీమ్, అబ్కారీ ఏపీఆర్ ఫోర్స్, అటవీ విభాగ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిలతో దాడులు జరిపి 20 ఎకరాల్లో పండిస్తున్న 2400 గంజాయి మొక్కలను కోసి వేసినట్లు ఆయన వెల్లడించారు.
గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: గంజాయి సాగుపై రాయగడ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గంజాయి వనాలపై విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధిలోని బెథియాపొడ పంచాయతీ రెలోకుప గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి వనాలను ధ్వంసం చేశారు. అబ్కారీశాఖ, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు ఐదు ఎకరాల విస్తీరణంలోని గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఈ అక్రమ గంజాయి సాగు జరుగుతుందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
20 ఎకరాల్లో గంజాయి ధ్వంసం


