ఆకర్షిస్తున్న మంకడా డియాన్ జలపాతాల కేంద్రం
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్‌లో శియ్యాళి లోట్టి పంచాయతీ మంకడా డియాన్ జలపాతాలు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. మంకడా డియాన్ జలపాతం చేరుకోవడానికి పర్లాకిమిడి నుంచి రాయఘడ మీదుగా 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడి నుంచి శియ్యాళి లోట్టి గ్రామానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. ఎత్తైన కొండల నడుమ ఆహ్లాద వాతావరణంలో ఉన్న మంకడా డియాన్ జలపాతాలు ఇప్పుడిప్పుడే విహార యాత్రగా ఇటీవల ప్రసిద్ధిగాంచాయి. అయితే పర్యాటకులు ఇక్కడ మద్యం సేవించడం వల్ల అసౌకర్యం కలుగుతోంది. పోలీసు రక్షణ కూడా లేదు. రెస్టు షెడ్ లేనికారణంగా పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆకర్షిస్తున్న మంకడా డియాన్ జలపాతాల కేంద్రం
ఆకర్షిస్తున్న మంకడా డియాన్ జలపాతాల కేంద్రం


