
జయపురం కేంద్ర విద్యాలయం సందర్శన
జయపురం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గల సమగ్ర గిరినాభివృద్ధి ఏజెన్సీ(ఐటీడీఏ) భవనంలో నిర్వహిస్తున్న జయపురం కేంద్ర విద్యాలయ తాత్కాలిక క్యాంపస్‌ను కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ మగళవారం సాయంత్రం సందర్శించారు. జయపురంలో కొత్తగా ప్రారంభిస్తున్న కేంద్ర విద్యాలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి పాఠ్య బోధనలు జరుగనున్నందున విద్యాలయంలో తరగతి గదులను, క్యాంపస్ పరిసరాలను తదితర సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జయపురం వస్తున్నట్లు తెలుస్తుంది. అందువల్ల విద్యాలయ భవనాలకు రంగులు వేయాలని అలాగనే విద్యాలయ సైన్‌బోర్డు మార్చాలని సూచించారు. అనంతరం గ్లోకల్ హాస్పిటల్ ప్రాంతంలో కేంద్ర విద్యాలయం భవనాలు నిర్మించేందుకు గుర్తించబడిన 8 ఎకరాల స్థలాన్ని కలక్టర్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేసే కార్యక్రమం ఉన్ననట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్‌తోపాటు జయపురం సబ్‌కలెక్టర్ కుమారి అక్కవరం శొశ్యా రెడ్డి, జయపురం మున్సిపాలిటీ అదనపు కార్యనిర్వాహక అధికారి పూజా రౌత్, జయపురం అదనపు తహసీల్దార్ చిత్తరంజన్ పట్నాయక్, ఐటీడీఏ ఇంజినీర్ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.