
వైభవంగా గుహారీ సంగీత ఉత్సవం
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రథయాత్ర పురస్కరించుకుని గుహారి జగన్నాథ భక్తి సంగీత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం ఆధ్వర్యంలో గురు కేలూ చరణ్ మహాపాత్రొ ఒడిస్సీ పరిశోధనా కేంద్రం ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తుంది. స్థానిక జీకేసీఎమ్ ఒడిస్సీ పరిశోధనా కేంద్రం ప్రాంగణం రంగ స్థలం వేదికగా మూడు రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని జగన్నాథుని భక్తి సంగీతాన్ని ఆలపిస్తారు. ముందుగా సంస్కృత పండితుడు ప్రొఫెసర్ ప్రఫుల్ల కుమార్ మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేశారు. జీకేసీఎమ్ ఒడిస్సీ పరిశోధన కేంద్రం విద్యార్థులు బృంద గానం చేశారు. తొలి రోజు ఉత్సవంలో ప్రఖ్యాత గాయకులు దుఃఖి శ్యామ్ త్రిపాఠి, సుస్మితా దాస్, లక్ష్మీకాంత పాలిత్, భాగ్యశ్రీ మహంతి, బిష్ణుమోహన్ కబీ, సంజు మహంతి వీనుల విందైన సంగీతం ఆలపించారు. మనోరంజన్ అధికారి (తబలా), సందీప్ సాహు (డ్రమ్), జబహర్ మిశ్రా (ఫ్లూట్), సముయేల్ ఖుంటియా (ఆక్టోప్యాడ్), సుబ్రత్ రౌత్రాయ్ (కీబోర్డు), అజయ్‌కుమార్ దాస్ (హార్మోనియం) వాద్య సహకారం అందజేశారు. డాక్టర్ మృత్యుంజయ రథ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వైభవంగా గుహారీ సంగీత ఉత్సవం

వైభవంగా గుహారీ సంగీత ఉత్సవం

వైభవంగా గుహారీ సంగీత ఉత్సవం