బొబ్బిలి రూరల్: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని స్పెషల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆస్మాఫర్హీన్ సూచించారు. మండలంలోని గోకుల్ విద్యాసంస్థలలో ఎస్‌ఈబీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాదకద్రవ్యాలవ్యతిరేక అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఎస్పీ విద్యార్ధులకు పలు సూచనలు చేశారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, జీవితం నాశనమ వుతాయని, కుటుంబసభ్యులు దూరమవుతారని, అలాగే మాదకద్రవ్యాలు కలిగి ఉండడం, తరలించడం, వాడడం చట్టరీత్యా నేరమని, వాటిపై ప్రభుత్వం కఠినచర్యలు చేపడుతుందని వివరించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు వాడుతున్నా,కలిగి ఉన్నా, తరలిస్తున్నా టోల్‌ఫ్రీనంబర్14500కు ఫోన్ చేసి తమకు తెలియజేయాలని సూచించారు. ఈ సదస్సులో గోకుల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.హేమలత, సిబ్బందితో పాటు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్స్‌పెక్టర్ ఆర్.జైభీమ్, సిబ్బంది పాల్గొన్నారు.
పోక్సో కేసులో ఇద్దరికి రిమాండ్
కొత్తవలస: పోక్సో కేసులో ఇద్దరు నిందితులకు కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్సై బొడ్డు దేవి గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌లపై దెందేరు గ్రామానికి చెందిన బొబ్బిలి రాజేష్, దాలిబోయిన ఎర్నాయుడులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు 17వ తేదీన కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.ఈ కేసు విచారణ కోసం నిందితులను కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. దీంతో ఎస్.కోట సబ్ జైలు నిందితులను తరలించారు.
బాలిక మృతి కేసులో
ముద్దాయికి రెండేళ్ల జైలు
బొండపల్లి: నిర్లక్ష్యంగా లారీని నడిపి బాలిక మృతికి కారణమైన ముద్దాయికి రెండు సంవత్సరాల జైలు శిక్ష తో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ జిల్లా కేంద్రంలోని ఎస్టీ,ఎస్సీ అట్రాసిటి కోర్టు న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా గురువారం తీర్పు ఇచ్చారు. ఇందుకు సంబంధించి ఎసై రవి తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. విజయవాడలోని కృష్టలంకకు చెందిన చలప తి దుర్గాప్రసాద్ 2017వ సంవత్సరంలో లారీ నిర్లక్ష్యంగా నడుపుకుంటూ వస్తూ నెలివాడ జంక్షన్ వద్ద జాతీ య రహదారిపై బాలికను ఢీకొనడంతో మృతి చెందింది.