
లాసెట్ తక్షణ ప్రవేశాల్లో భాగంగా ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్న దృశ్యం
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మహాత్మా జ్యోతిరావు పూలే న్యా య కళాశాలలో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ (న్యాయ విద్య) తక్షణ ప్రవేశాలు గురువారం నిర్వహించారు. తక్షణ ప్రవేశాలకు లాసెట్ –22 అర్హత, ప్రభుత్వ రాయితీలు వర్తించకపోయినా అనూ హ్య స్పందన లభించింది. 35 మంది విద్యా ర్థులు ప్రవేశాలు పొందారు. ఇటీవలే వర్సిటీ న్యాయ కళాశాలకు బీసీఐ గుర్తింపు వచ్చింది. దీంతో ప్రవేశాలు మొదలుపెట్టారు. అలాగే ఎడ్ సెట్ రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి కావటంతో వర్సిటీ నిర్వహిస్తున్న స్పెషల్ బీఎడ్ మెంటల్లీ రిటార్డ్‌కు తక్షణ ప్రవేశాలు గురువారం నిర్వహించారు. ప్రవేశాల ప్రక్రియ కోర్సు కోఆర్డినేటర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఎడ్‌సెట్ ర్యాంకు ఆధారంగా అర్హత ఉన్న ఐదుగురికి ప్రవేశాలు కల్పించారు. కోర్సులో ఉన్న 30 సీట్లు పూర్తయ్యాయి.