
ర్యాలీని ప్రారంభిస్తున్న రమణకుమారి
విజయనగరం ఫోర్ట్:
పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, ఖైనీ, గుట్కాలు తినడంవల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.వి.రమణకుమారి తెలిపారు. నోటిశుభ్రతపై వైద్యఆరోగ్య సిబ్బంది చేపట్టిన ర్యాలీని సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికకారం, ఘాటు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. శీతలపానీయం వినియోగం తగ్గించాలని చెప్పారు. తిన్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవాలన్నారు. తీపి పదార్థాలు వీలైనంతవరకు తక్కువ తీసుకోవాలని సూచించారు. రోజుకు రెండుసార్లు దంతాలను శుభ్రం చేసుకోవడం ఉత్తమమన్నారు. పోషకవిలువలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌సీడీపీఓ డాక్టర్ పి.రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, డెమో చిన్నతల్లి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.వి.రమణకుమారి