
రైల్వేస్టేషన్ వద్ద విశ్వనాథ్‌కు స్వాగతం పలుకుతున్న సీవా ప్రతినిధులు
జయపురం: నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో జరిగిన పవర్ లిఫ్టింగ్ ప్రపంచ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచిన జయపురం యువకుడికి ఘన స్వాగతం స్వాగతం లభించింది. నేపాల్ నుంచి ఆయన స్వస్థలం జయపురానికి రైలులో ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భం సోషియల్ ఎడ్యుకేషనల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ అసోసియేషన్(సీవా) ప్రతినిధులు రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. అంతర్జాతీయ పోటీల్లో వేర్వేరు విభాగాల్లో 2పతకాలు సాధించడం పట్ల వారంతా ప్రసంశించారు. భవిష్యత్‌లో దేశానికి మరిన్ని పతకాలు సాధించి పెట్టాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సీవా అధ్యక్షుడు అయ మిశ్రా, కార్యదర్శి ప్రతాప్‌కుమార్ పట్నాయక్, సభ్యులు మున్నా సాహు, నలినీ బర్దన్, శ్రీనివాస పట్నాయక్ పాల్గొన్నారు.