
బీరేంద్ర పాండే(ఫైల్)
భువనేశ్వర్:
ఝార్సుగుడ మాజీ ఎమ్మెల్యే బీరేంద్ర పాండే(75) భువనేశ్వర్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత దీర్ఘకాల వ్యాధితో ఆయన గత కొంతకాలంగా మంచం పట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఝార్సుగుడ అసెంబ్లీ స్థానం నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980, 1985, 1995లో వరుసగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన మృతిపట్ల పలువురు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు సంతాపం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా.. గత 15నెలల స్వల్ప వ్యవధిలో ఝార్సుగుడ నియోజకవర్గంలో నలుగురు ప్రముఖ రాజకీయ నాయకులు మృతి చెందారు. కిషోర్ మహంతి, హేమానంద్ బిశ్వాల్, నవకిషోర్ దాస్, వీరేంద్ర పాండే మరణాలు రాజకీయ నాయకత్వంలో ఒక రకమైన శూన్యతను మిగిల్చాయి.