ఎచ్చెర్ల క్యాంపస్: గేట్ ఫలితాల్లో శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సత్తాచాటారు. శ్రీకాకుళం క్యాంపస్ నుంచి 46 మంది విద్యార్థులు అర్హత మార్కులు సాధించగా, జి.శివప్రసాద్‌రెడ్డి సీఎస్ ఈ విభాగంలో 21వ ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థిది విజయవాడకాగా, శ్రీకాకుళం క్యాంపస్‌లో చదువుతున్నాడు. ఈ విద్యార్థితో పాటు బి.జీవన సంధ్యారాణి ఈసీఈ విభాగంలో 78వ ర్యాంకు, కె.డీపక్ మెకానికల్ విభాగంలో 80వ ర్యాంకు, బి.రామకృష్ణ ఈసీఈలో 139వ ర్యాంకు, ఎన్.వినయ్‌కుమార్ ఈసీఈ 152వ ర్యాంకు, ఎన్.శ్రీసాయి ఈసీఈలో 337వ ర్యాంకు, కె.నాగేంద్ర ఈసీఈలో 635వ ర్యాంకు, పి.రవివెంకట్ ఈసీఈలో 694, పి.కుమార్ ఈసీఈలో 1257 ర్యాంకు సాధించారు. వీఇని అధ్యాపకులు అభినందించారు.