
ఉగాది సంబరాల కార్యక్రమంలో చిన్నారులు, మహిళలు
బొబ్బిలి: పట్టణంలోని శ్రీ కళాభారతి మున్సిపల్ ఆడిటోరియంలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఆనందో బ్రహ్మ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సందడిగా జరిగింది. తరచూ జరిగే సకల కళా కార్యక్రమాలతో పాటు ఉగాది సందర్భంగా ప్రత్యేక వేషధారణల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆకర్షించారు. ఉగాది సంప్రదాయాన్ని తెలియజేసేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రముఖులు నంబియార్ వేణుగోపాలరావును ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్ అధ్యక్షుడు మింది విజయమోహనరావు పాల్గొన్నారు.