మండలాల వారీగా బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు
మండలం జీపీలు అభ్యర్థులు
బోధన్ 22 67
సాలూర 09 28
ఎడపల్లి 16 58
రెంజల్ 16 54
చందూర్ 03 56
మోస్రా 05 19
నవీపేట 30 ––
155 466
రుద్రూర్ 11 39
కోటగిరి 11 46
పోతంగల్ 19 60
వర్ని 13 39
బోధన్: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగనున్న 184 గ్రామ పంచాయతీలకు గాను 29 గ్రామ సర్పంచ్‌లు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈనెల 11వ తేదీన బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని బోధన్ రూరల్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి మండలాల్లోని గ్రామాలతోపాటు నిజామాబాద్ రెవె న్యూ డివిజన్‌లోని నవీపేట మండలంలోని గ్రామాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. గత నెల 29న నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ, బుధవా రం విత్‌డ్రా గడువు ముగిసింది. 155 సర్పంచ్ స్థానాలకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయ్యాయి.
హెచ్చరికలు అక్కడికే పరిమితమా..
వర్ని: బలవంతపు ఏకగ్రీవాలపై చర్యలు తప్ప వని అధికారులు హెచ్చరికలు జారీ చేసినా అవి అక్కడికే పరిమితమయ్యాయని పలువురు పేర్కొంటున్నారు. చాలా గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలను వేలం వేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వర్ని మండలంలో రూ.4 లక్షల నుంచి రూ.41 లక్షల వరకు వేలం సాగినట్లు తెలుస్తోంది. గ్రామాల అభివృద్ధి, అవసరమైన నిధుల కోసమంటూ ఎన్నికలకు వెళ్లకుండా పదవులను కట్టబెట్టారనే విమర్శలున్నాయి.


