బోధన్‌లో ‘అమృత్’ సర్వే ప్రారంభం
బోధన్: అమృత్ 2.0 పథకం కింద బోధన్ మున్సిపాలిటీ పరిధిలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సర్వే బుధవారం ప్రారంభమైంది. డీటీసీపీ ఆదేశాల మేరకు పట్టణంలోని 38వ వార్డులో సర్వే సంస్థల ప్రతినిధులు సర్వే నిర్వహించారు. రోడ్లు, తాగు నీటి సరఫరా, డ్రెయినే జీ వ్యవస్థ , ఇంటి నంబర్లు, యజమాని వివరాలు, భవన విస్తీరణం, ఇతర మౌలిక సదుపాయాల డేటాను సేకరిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణ అభివృద్ధికి కీలకమైన సర్వేకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
డిచ్‌పల్లి(జక్రాన్‌పల్లి): హైదరాబాద్ కన్న య్య శాంతివనంలో బుధవారం జరిగిన మ హా కిసాన్ మేళా (అంతర్జాతీయ రైతు సదస్సు)లో జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌కు చెందిన రైతు పాట్కూరి తిరుపతిరెడ్డికి ‘రైతు రత్న’ అవార్డు ప్రదానం చేశారు. జిల్లాలో రైతు ఉత్పదారుల సంఘం బలోపేతం కోసం నెలకొల్పిన జేఎంకేపీఎం ఎఫ్‌పీవో టర్మరిక్ క్లస్టర్‌ను గుర్తించి అవార్డును అందించినట్లు తిరుపతిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ (ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు) రీవాల్యుయేషన్‌కు ఈ నెల 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. నవంబర్–2025 లో జరిగిన పీజీ ఏపీఈ, పీసీహెచ్, ఐఎంబీ ఏ 1, 3వ, ఎల్‌ఎల్‌బీ 1, 2, 3, 4వ సెమిస్టర్ రెగ్యులర్, థియరీ పరీక్షలకు హాజరైన వారు మాత్రమే రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.500, దరఖాస్తు ఫారానికి రూ.25 చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెయూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కంట్రోలర్ సూచించారు.
నిజామాబాద్‌నాగారం: రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ సెపక్‌తక్రా పోటీలకు ఉమ్మడి జిల్లా బృందం ఖరారైనట్లు సెక్రెటరీ నాగమణి బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెసిడెన్సి హైస్కూల్‌లో బుధవారం ఎంపికలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–17 బాలికల సెపక్‌తక్రా పోటీలకు కోచ్‌గా మోపాల్ జడ్పీహెచ్‌ఎస్ పీడీ, బాలురకు నాగరాజు, నరేశ్ కోచ్, మేనేజర్లుగా వ్యవహరించనున్నారు.
ఖలీల్‌వాడి: కులాస్‌పూర్ విద్యార్థులు రాసిన స్నేహ చంద్రికలు కథా సంపుటిని జిల్లా వి ద్యాధికారి అశోక్ బుధవారం ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవయిత్రి, ఉపాధ్యాయురాలు స్వర్ణ సమత సంపాదకత్వం, ఇందూరు జిల్లా బాల సాహి త్య వేదిక ఆధ్వర్యంలో స్నేహ చంద్రికలు కథా సంపుటి విద్యార్థులు రచించడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఇందూరు బాల సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల నరేశ్ రావు , కోశాధికారి చింతల శ్రీనివాస్, ఎంఈవో సాయిరెడ్డి , జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, కాంతారావు, ఉమారాణి, స్వర్ణ సమత పాల్గొన్నారు.
బోధన్‌లో ‘అమృత్’ సర్వే ప్రారంభం
బోధన్‌లో ‘అమృత్’ సర్వే ప్రారంభం
బోధన్‌లో ‘అమృత్’ సర్వే ప్రారంభం


