రెండో విడత నామినేషన్‌లు 4942
జిల్లాలో ‘పల్లెపోరు’ ఊపందుకుంది. మొదటి విడత, రెండో విడత ఎన్నికలు జరగను న్న జీపీలకు సంబంధించి నామినేషన్‌ల దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. మొదటి విడత నామినేష న్‌ల ఉపసంహరణకు నేడు మూడు గంటల వరకు అవకాశం ఉంది. మూడో విడతకు సంబంధించి నామి నేషన్‌ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది.
సుభాష్‌నగర్: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండో విడత నామినేషన్‌ల స్వీకరణ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చి వరిరోజు కావడంతో నామపత్రాల స్వీకరణ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటలలోగా కేంద్రంలోకి వచ్చిన వారికి అధికారులు టోకెన్లు అందించి దరఖాస్తులు స్వీకరించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌తోపాటు ఆర్మూర్ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి మండలంలోని 196 జీపీలు, 1,760 వా ర్డుస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తరలివచ్చిన అభ్యర్థులు
నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడం.. బుజ్జగింపుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో నామినేషన్ల దాఖలు కోసం అభ్యర్థులు పోటాపోటీగా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 596, వార్డు స్థానాలకు 2,400 నామినేషన్‌లు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 1,178, వార్డు స్థానాలకు 3,764 మంది నామినేషన్‌లు వేశారు.
పరిశీలన..
బుధవారం నామపత్రాల స్క్రూటినీ ఉంటుంది. 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంది. అదేరోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించి గుర్తులను కేటాయిస్తారు. డిసెంబర్ 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు.
తొలి విడత ఉపసంహరణ నేడు..
బోధన్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే నామినేషన్‌ల స్క్రూటినీ పూర్తికాగా బుధవారం ఉప సంహరణ ప్రక్రియను చేపట్టనున్నారు. బోధన్ రెవెన్యూ డివిజన్‌లోని పది మండలాలతోపాటు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని నవీపేట మండలంలోని 184 సర్పంచ్ స్థానాలకు 1156 నామినేషన్‌లు, 1642 వార్డు సభ్య స్థానాలకు 3,526 నామినేషన్‌లు దాఖలైనట్లు స్క్రూటినీ తరువాత అధికారులు తేల్చారు. బుధవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. ఎడపల్లి, బోధన్, వర్ని, కోటగిరి మండలాల్లోని ఏడు గ్రామాల సర్పంచ్ స్థానాలు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి.
చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 596..
వార్డు స్థానాలకు 2400
5 గంటల తర్వాత గేట్లు మూసివేత
అభ్యర్థులకు టోకెన్లు అందజేసి
దరఖాస్తులు తీసుకున్న అధికారులు
రాత్రి వరకూ కొనసాగిన
నామపత్రాల స్వీకరణ


