పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఒకే నామినేషన్
సింగంపల్లితండాలో..
● పోటీ లేని సుమారు 9 సర్పంచ్ స్థానాలు
● ఏకగ్రీవమైనట్లు అధికారులు
ప్రకటించడమే తరువాయి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): నిజామాబాద్ రూరల్ మండలంలోని పాల్దా, లింగి తండా, ధర్మారం తండా సర్పంచ్ స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. పాల్దా జనరల్ రిజర్వ్ కావడంతో మున్నూరు ప్రభాకర్, లింగి తండా ఎస్టీకి రిజర్వ్ కావడంతో మాలావత్ రమేష్, ధర్మారం తండా ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో బాదావత్ కల్పన మాత్రమే నామినేషన్ వేశారు. దీంతో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లేనని ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు పేర్కొంటున్నారు. ఇక అధికారికంగా ప్రకటించాల్సి ఉందంటున్నారు. కానీ ఆయా గ్రామాల్లో ఉపసర్పంచ్ స్థానం కోసం వార్డు స్థానాలకు ఒకటికి మించి నామినేషన్లు దాఖలయ్యాయి.
డిచ్‌పల్లి మండలంలో..
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు గానూ నాలుగు గ్రామాల్లో సర్పంచ్, 306 వార్డు స్థానాలకు గానూ 90 స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. నర్సింగ్‌పూర్ (కొత్తపేట) గ్రామ సర్పంచ్‌గా ఎంకాయల శోభ, కొరట్‌పల్లి తండా సర్పంచ్‌గా బానోత్ సంగీత, నక్కలగుట్ట తండా సర్పంచ్‌గా లకావత్ దేవీసింగ్, మిట్టపల్లి తండా సర్పంచ్‌గా బుక్య సెవంత నవుసీరాం ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆ గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లేనని అధికారులు పేర్కొన్నారు. నామినేషన్ల విత్‌డ్రా అనంతరం మరో రెండు గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లి సర్పంచ్ స్థానానికి ఒక్కరే నామినేషన్ దాఖలుచేశారు. ఎస్సీ (మహిళ)కు రిజర్వ్ కావడంతో గ్రామపెద్దలు కలిసి చారుగొండ లిఖితతో నామినేషన్ దాఖలు చేయించారు. 10 వార్డు స్థానాలకుసైతం ఒక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో గ్రామంలో సర్పంచ్, వార్డుస్థానాలన్నీ ఏకగ్రీవమైనట్లే. కాగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
మాక్లూర్: మండలంలోని సింగంపల్లి తండా గ్రా మ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్ అభ్యర్థి గా జాదవ్ శాంత, వార్డు సభ్యులకు కూడ ఒక్కోక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. తండాలో నామినేషన్ల పక్రియ ప్రారంభమైనప్ప టి నుండి చివరి రోజైన మంగళవారం వరకు మ రెవరూ నామినేషన్లు వేయలేదు. దీంతో తండా పాలకవర్గం ఏకగ్రీవం లాంఛనమే అయింది. దీంతో తండావాసులు పెద్ద ఎత్తున టపాకాయ లు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. ఇక తండా సర్పంచ్‌గా జాదేవ్ శాంత, ఉప సర్పంచ్‌గా బానోత్ సంజీవ్, 8 వార్డు సభ్యు లు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించమే మిగిలింది.


