ఆలూరులో భారీ చోరీ
● 14 తులాల బంగారం, అర కిలో వెండి, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
ఆర్మూర్ టౌన్: ఆలూర్ మండల కేంద్రంలోని తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్‌లో నివాసం ఉండే కట్టే మిషన్ పుల్లెల రాము తన భార్య, పిల్లలతో కలిసి నవంబర్ 27న వారి మామ దినకర్మ కోసం వేరే ఊరికి వెళ్లారు. డిసెంబర్ 2 మంగళవారం సాయంత్రం వారు తిరిగి ఇంటికి రాగా తలుపులకు వేసిఉన్న తాళాలు పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి, బీరువా, డ్రెస్సింగ్‌టేబుల్‌లో ఉన్న 14 తులాల బంగారం, అరకిలో వెండి, రూ.లక్ష నగదును చోరీ చేశారు. ఈమేరకు బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.


