ఒకేచోట.. పరిశోధన, విస్తరణ, బోధన
● వ్యవసాయాభివృద్ధిలో
ప్రత్యేకతను చాటుతున్న ‘రుద్రూర్’
● నేడు జాతీయ వ్యవసాయ
విద్య దినోత్సవం
రుద్రూర్: వ్యవసాయాభివృద్ధిలో రుద్రూర్ ప్రాంతం ప్రత్యేకతను చాటుతోంది. ఈప్రాంతంలో ఏర్పాటు చేసిన చెరుకు, వరి పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ కళాశాలతో ఒకేచోట వ్యవసాయంలో పరిశోధనలు, కొత్తవంగడాల విస్తరణ, బోధన తరగతులు కొనసాగుతూ వ్యవసాయానికి సాయం చేస్తున్నాయి. నేడు జాతీయ వ్యవసాయ విద్య దినోత్సవం సందర్భంగా రుద్రూర్‌లోని కేంద్రాలపై ప్రత్యేక కథనం.
నిజామాబాద్ జిల్లాలోని రుద్రూరు ప్రాంతంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన బోధన, పరిశోధన, విస్తరణ సంస్థలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రానికి సమీపంలో 1932లో ప్రాంతీయ చెరకు, వరి పరిశోధనా స్థానం ఏర్పాటు చేశారు. నాటి నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు నిర్వహించి వరి, చెరకులో దిగుబడి పెంచే నూతన వండాలను రూపొందించి రైతులకు పరిచయం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన వంగడాల గూర్చి విస్తరించడంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది. దీన్ని 2004లో ఇక్కడనే ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జిల్లా రైతాంగానికి అందించడం, క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ విస్తీర్ణ కార్యక్రమాల ద్వారా రైతులను చైతన్య పరుస్తోంది. అలాగే రైతులకు స్వయం ఉపాధి పెంపొందించుకొనే దీర్ఘకాలిక శిక్షణా తరగతులు నిర్వహిస్తుంది.
వ్యవసాయ కళాశాలలు..
విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ కళాశాలను 2005లో స్థాపించబడినప్పటికీ, దీన్ని 2022లో వ్య వసాయ పాలిటెక్నిక్ కళాశాలగా మార్చారు. ఈ క ళాశాలలో విద్యార్థులకు తరగతుల్లో పాఠాలు చెప్పడమే కాకుండా వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, పంట విత్తుట నుంచి కోత వరకు అనుభ వం వచ్చేలా బోధన చేస్తారు. అలాగే 2015లో ఆహా ర రంగంలో డిమాండ్ ఆధారిత, విలువ ఆధారిత నాణ్యమైన సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో 2015లో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలను ఏర్పాటు చేశారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, మౌ లిక సదుపాయాలు విద్యార్థులకు మంచి సైద్ధాంతి క, ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ కళాశాల 2021లో న్యూఢిల్లీలోని ఐసీఎఆర్ ద్వారా ’ఎ’ గ్రేడ్ గుర్తింపు పొందింది.
రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం పరిశోధన, విస్తరణ, బోధన కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. చెరుకు, వరి వంటి పంటలకు సంబంధించిన కొత్త వంగడాలను అభివృద్ధి చేయడంతోపాటు, క్షేత్రస్థాయిలో రైతులకు పరిచయం చేస్తుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలు చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే రకాలను రూపొందిస్తారు. శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు, రైతులతో సమన్వయం చేసుకుంటూ పని చేస్తుంది.
– పవన్ చంద్రారెడ్డి, అధిపతి,
వ్యవసాయ పరిశోధన కేంద్రం,
ప్రిన్సిపాల్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల


