
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి
నిర్మల్‌టౌన్: వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రవాణాశా ఖ కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది వి ధులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ యన మాట్లాడుతూ.. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. వాహనాల తనిఖీ చేపట్టి ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా కార్యాలయ ఆవరణలో మొ క్క నాటారు. ఆయన వెంట జిల్లా రవాణాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ఎంవీఐలు మహేందర్, ముర్తుజా ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు.