
బహిరంగ సభ సక్సెస్ చేయాలి
భైంసాటౌన్: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈనెల 4న నిర్వహించనున్న కాంగ్రెస్ గ్రామాధ్యక్షు ల సమ్మేళన బహిరంగ సభను జయప్రదం చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ ఇన్‌చార్జి, ముధోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల ఎన్నికల సహ ఇన్‌చార్జి రాంభూపాల్ కోరారు. బుధవారం పట్టణంలోని కమల జిన్నింగ్ ఫ్యాక్టరీలో నియోజకవర్గ ఇన్‌చార్జి బీ నారాయణ్‌రావు పటేల్ అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు, ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను బూత్ స్థాయిలో ప్రజలకు వివరించేందుకు గ్రామ అధ్యక్షులతో సమ్మేళన సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరై దిశానిర్దేశం చే స్తారని తెలిపారు. నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆత్మ చైర్మన్ సిద్దం వివేకా నంద, నాయకులు రాంచందర్, భోజరాం పటేల్, ముత్యంరెడ్డి, శంకర్ చంద్రే, తదితరులున్నారు.
అధికసంఖ్యలో తరలిరావాలి
ఖానాపూర్: ఈ నెల 4న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి రాంభూపాల్ కోరారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో తరలిరావాలని కోరారు. నాయకులు దయానంద్, సత్యం, భూషణ్, మాజిద్, స్వప్నిల్‌రెడ్డి, యూసుఫ్‌ఖాన్, షబ్బీర్ పాషా, సలీంఖాన్, షౌకత్ పాషా, గంగనర్సయ్య, కిశోర్‌నాయక్, శంకర్, సురేశ్, శ్రీనివాస్, రాజునాయక్, గంగాధర్, శ్యాం, అయూబ్, శేషాద్రి, రాజేశ్వర్, దియా తదితరులున్నారు.