
హాజరు శాతం పెంచాలి
● జిల్లా మాధ్యమిక విద్యాధికారి
జాదవ్ పరశురామ్
లోకేశ్వరం: ప్రభుత్వ కళశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురామ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాలను గురువారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి.. తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతేడాదికన్నా ఈ ఏడాది ప్రవేశాలు 30 శాలం పెరగాలని ఆదేశించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ గౌతం, అధ్యాపకులు ఉన్నారు.