
మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన అనీస్ రైల్వేస్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. పలువురు షీ టీంకు సమాచారం అందించగా.. అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
మద్యం తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఏఎస్సై దివాకర్, కు టుంబీకులు తెలిపిన వివరా లు.. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన ఒల్లెపు వెంకటేశ్(40), సుజాత దంపతులు. వీరికి కుమారుడు గణేశ్, కూతుళ్లు బిందు, దివ్య ఉన్నారు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవా రు. వెంకటేశ్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి రావడంతో తరచూ గొ డవలు జరిగేవి. ఎదిగిన పిల్లలు ఉన్నారని, మద్యం తాగుడు మానేయాలని భార్య మందలించడంతో వెంకటేశ్ మనస్తాపం చెందాడు. శుక్రవారం ఎఫ్ సీఐ గోదాము వెనుకాల మద్యం మత్తులో పురుగు ల మందు తాగి చనిపోతున్నానని కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.