
పాలిటెక్నిక్ సీట్లకు కౌన్సెలింగ్
శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో యాజమాన్యం కోటా సీట్లు భర్తీ చేశారు. శనివారం కౌన్సెలింగ్‌కు కంపెనీ ఉద్యోగుల పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలు హాజరయ్యారు. మొత్తం సీట్లలో యాజమాన్యం కోటా కింద సగం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. ప్రతీ కోర్సుల్లో 30 సీట్ల చొప్పున 150 సీట్ల ఉండగా, కౌన్సెలింగ్‌లో 84 మంది విద్యార్థులు సీట్లు పొందారు. మొదటి సీటును 1,445 ర్యాంకు సాధించిన ఈ.సుజల్ అనే విద్యార్థి కంప్యూటర్స్‌లో సీటు పొందగా, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్‌రావు ఆయనకు అడ్మిషన్ అందించారు. మిగిలిన సీట్లలో.. సివిల్‌లో 26, కంప్యూటర్స్‌లో 01, ఎలక్ట్రీకల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 5, మెకానికల్‌లో 24, మైనింగ్‌లో 10 సీట్లను త్వరలో స్పాట్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్, హెచ్‌ఓడీలు జి.దామోదర్, జి.రవీందర్, నరసింహాస్వామి, శ్యామల, కె.సుమన్ పాల్గొన్నారు.