
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ జిల్లా కార్యవర్గం
నిర్మల్‌చైన్‌గేట్: టీటీసీడీఏ ఆధ్వర్యంలో జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్‌లో గురువారం నిర్వహించారు. అధ్యక్షుడిగా సాదం అరవింద్, ప్రధాన కార్యదర్శిగా నేరెళ్ల ప్రమోద్, కోశాధికారిగా బద్రి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ధర్మగడ్డ శ్రీహరి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. టీటీసీడీఏ ఆర్గనైజింగ్ సెక్రటరీలు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గాలిపెల్లి నరసయ్య, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షు, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, రాజేందర్ జిల్లా కెమిస్ట్రీ సభ్యులు పాల్గొన్నారు.