సమర్థవంతంగా ‘ఇందిర సౌర గిరి జలవికాసం’ | - | Sakshi
Sakshi News home page

సమర్థవంతంగా ‘ఇందిర సౌర గిరి జలవికాసం’

Jul 4 2025 3:39 AM | Updated on Jul 4 2025 3:39 AM

సమర్థ

సమర్థవంతంగా ‘ఇందిర సౌర గిరి జలవికాసం’

● కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

నిర్మల్‌చైన్‌గేట్‌: జిల్లాలో ఇందిర సౌర గిరి జలవికా స పథకాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ స మావేశ మందిరంలో ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో ఖుష్బూగు ప్తా, ఇతర శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో ఉచితంగా బోర్లు తవ్వించి, సోలార్‌ పంప్‌ సెట్లు ఏర్పాటు చేయాలన్నారు. సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చి వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతీ హ్యాబిటేషన్‌లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పథకం అమలులో భాగంగా మండలస్థాయిలో ఎంపీడీవో అధ్వర్యంలో 9 మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని, నిబంధనలపై అధికారులు అవగాహన కలిగి ఉండేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా మాట్లాడుతూ లబ్ధిదా రుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కమిటీలు అర్హులను గుర్తించి వారికి తగిన పరికరాలు అందజేయాలన్నారు. సాగునీటి సదుపాయం కలిగిన రైతులు వాణిజ్య పంటలు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఫైజాన్‌అహ్మద్‌, డీఎఫ్‌వో నాగిని భాను, జెడ్పీ సీఈవో గోవింద్‌, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి అంబాజీ, జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్‌, డీపీవో శ్రీనివాస్‌, ఉద్యాన శాఖ అధికారి రమణ, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

నాణ్యమైన సేవలు అందాలి

లక్ష్మణచాంద: ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని పలు కార్యాలయాలను గురువారం సందర్శించారు. మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీలు చేశారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచి, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. తరగతుల పరిస్థితి, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల విద్యాస్థాయి అంశాలపై వివరాలు ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లిష్‌ పాఠాలు చదివించారు. గణితం సమస్యలు చేయించి ప్రోత్సహించారు. మొక్కలు నాటారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక నిర్మాణంలో ఉన్న భవనంలో కూర్చోవడంతో వెంటనే కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు పూర్తి చేసేలాగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంత రం పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు నేలపై వేసిన చద్దర్‌పై పడుకొని ఉండటంతో వర్షాకాలంలో చలిగా ఉంటుందని, చిన్నారులు ఇబ్బంది లేకుండా పడుకునేందుకు చిన్నచిన్న బెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుపాలని అధికారును ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను తొలగించాలని సూచించా రు. తర్వాత గ్రోమోర్‌ ఎరువుల దుకాణంలో ఎరువుల నిల్వలు, రిజిస్టర్లు, విక్రయ వివరాలను తనిఖీ చేసిన కలెక్టర్‌, రైతులకు నకిలీ విత్తనాలు, మందులు విక్రయించకూడదని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఈవో రామారావు, డీఎంహెచ్‌వో రాజేందర్‌, డీఏవో అంజిప్రసాద్‌, మండల ప్రత్యేక అధికారి అంబాజీ, తహసీల్దార్‌ సరిత, ఎంపీడీవో రాధ రాథోడ్‌ ఉన్నారు.

సమర్థవంతంగా ‘ఇందిర సౌర గిరి జలవికాసం’1
1/1

సమర్థవంతంగా ‘ఇందిర సౌర గిరి జలవికాసం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement