
కుభీర్‌లో ఆక్రమణల తొలగింపు
కుభీర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట డ్రైనేజీపై ఉన్న ఆక్రమణలను బుధవారం ఆర్డీవో కోమల్‌రెడ్డి సమక్షంలో తొలగించారు. ఆక్రమణల కారణంగా వరదనీరు ఆస్పత్రిలోకి, పక్కనున్న విఠలేశ్వర మందిరంలోకి చేరుతోందని, తొలగించి న్యాయం చేయాలని ఆలయ కమిటీవారు, గ్రామపంచాయతీ అధికారులు కోర్టులో కేసు వేశారు. ఈ క్రమంలో ఆక్రమణదారులు కూడా తొలగించవద్దని కోర్టును ఆశ్రయించారు. ఇటీవల హైకోర్టు ఆక్రమణలు తొలగించాలని తీర్పు ఇవ్వగా ఇటీవల తహసీల్దార్ శివరాజ్ ఆక్రమణదారులతో మాట్లాడి కొన్నింటిని తొలగించారు. కాగా, కొందరు మొండికేశారు. దీంతో బుధవారం ఆర్డీవో కోమల్‌రెడ్డి పోలీసు బందోబస్తుతో వచ్చి వాటినీ తొలగించారు. ఒక పండ్ల వ్యాపారి తన వద్ద స్థలం కాగితాలున్నాయని చెప్పగా గురువారం 11గంటలకు తీసుకురాకుంటే 12గంటలకు తొలగిస్తామని చెప్పి వెళ్లిపోయారు. భైంసా రూరల్ సీఐ నైలు, తహసీల్దార్ శివరాజ్, ఎస్సై కృష్ణారెడ్డి, ఎంపీవో మోహన్‌సింగ్, ఆస్పత్రి డాక్టర్ విజయ్, ఈవో గౌతం తదితరులున్నారు.