
దొడ్డి కొమరయ్యకు నివాళి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో దొడ్డి కొమరయ్య వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య ఆదర్శాలను భావితరాలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా అధికారులు నరసింహారెడ్డి, రమణ, సరోజ, విష్ణువర్ధన్, శ్రీకాంత్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, ఇతర శాఖల ఉద్యోగులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.