
కుంసరలో దొంగల హల్‌చల్
భైంసారూరల్: మండలంలోని కుంసర గ్రామంలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. నా లుగు ఇళ్లల్లో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్ప డ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. సొలంకి అ బారావు, సులోచన, మాధవ్, సురేందర్‌రెడ్డి ఇళ్లలో దొంగలు చొరబడి బీరువాలను పగులగొట్టారు. నగదు, బంగారం దొరకకపోవడంతో సామగ్రిని చిందరవందరగా పారేశారు. సురేందర్‌రెడ్డి బైక్‌ను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని స్థానికులు బాధితులు, పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సైలు శంకర్, సుప్రియలు ఆదివారం సంఘటన స్థలానికి చేరుకు ని పరిశీలించారు. క్లూస్‌టీంతో వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ పేర్కొన్నారు.