
అత్తింటి వేధింపులకు వివాహిత బలి
దండేపల్లి: అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ కథనం ప్రకారం.. లక్సెట్టిపేట మండలం సురారం గ్రామానికి చెందిన పొరండ్ల శంకరయ్య కుమార్తె రూప (22)ను దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన అల్లె మహేశ్‌తో మూడేళ్ల క్రితం వివాహం చేశారు. వారికి రెండేళ్ల బాబు ఉన్నాడు. మహేశ్ ఉపాధి కోసం పది నెలల క్రితం సింగపూర్‌కు వెళ్లాడు. పెళ్లయిన కొన్నినెలల నుంచే మహేశ్ రూపను వేధింపులకు గురిచేసేవాడు. ఫోన్లలో వేధించసాగాడు. ఈ విషయం రూప తల్లిదండ్రులకు చెప్పడంతో ఇద్దరికి నచ్చజెప్పారు. నాలుగురోజుల క్రితం ఏదో మెసేజ్ వచ్చిందని అత్తమామలు లక్ష్మి, పుల్లయ్య, ఆడబిడ్డ అల్స మమత, ఆమె భర్త సుమన్‌లు ఆమెను వేధింపులకు గురిచేశారు. భర్త మహేశ్ కూడా ఫోన్‌లో వేధించాడు. ఈ విషయాన్ని రూప తన తండ్రికి ఫోన్‌లో చెప్పి ఎడువడంతో నచ్చజెప్పారు. ఈక్రమంలో రూప శనివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. గుడిరేవుకు చెందిన కాసారపు సాయికిరణ్ ఈ విషయాన్ని రూప తండ్రికి ఫోన్‌లో చెప్పి లక్సెట్టిపేట ఆసుపత్రికి తరలించారు. వెంటనే శంకరయ్య కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. రూపను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో అత్తమామాలు లక్ష్మి, పుల్లయ్య, భర్త మహేశ్, ఆడబిడ్డ అల్స మమత, ఆమె భర్త సుమన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కూతురు, అల్లుడికి గొడవలు మనస్తాపంతో ఒకరు ఆత్మహ త్య
కుభీర్: కూతురు, అల్లుడికి మధ్య గొడవలతో మనస్తాపం చెందిన తండ్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రానికి చెందిన నీలకంఠ గోవిందు (64)కు భార్య, కుమార్తె నర్మద, అల్లుడు అందరూ ఒకేటో ఉండేవారు. కూతురు, అల్లుడు తరచూ గొడవపడేవారు. దీంతో మనస్తాపం చెందిన నీలకంఠ గోవిందు ఆదివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు.