
వాన జోరు.. వరద లేటు!
నిర్మల్
● జిల్లాలో నాలుగు రోజులుగాకురుస్తన్న వర్షం.. ● ఎగువన నామమాత్రం ● ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో అంతంతే ● అక్కడ పడితేనే.. ఇక్కడ నిండేది..
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025
పోగొట్టుకున్న ఫోన్లు అప్పగింత
నిర్మల్‌టౌన్: మొబైల్ ఫోన్ పొతే ఆందోళన వద్దని, ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో లేదా మీ సేవ ద్వారా ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. https:// www.ceir.gov.in/ వెబ్ పోర్టల్ ద్వారా ఫోన్ ఆచూకీ తెలుసుకోవడం చాలా సులభమన్నారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 76 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ వెబ్‌సైట్ ద్వారా గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని ఎస్పీ బాధితులకు శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అందజేశారు. మార్కెట్‌లో చౌకగా వస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్‌లు కొనేముందు సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,496 ఫోన్లను రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీ కోర్, వివిధ పోలీస్‌స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్: జిల్లాలో ఇప్పుడిప్పుడే వానకాలం జోరు పెరుగుతోంది. నాలుగు రోజులుగా అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ముసురు పెట్టినట్లుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. వాగులు, కుంటలు, చెరువులు క్రమంగా నీళ్లు చేరుతున్నాయి. కానీ ప్రాజెక్టుల్లోకి వరద రావడం లేదు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తేనే జిల్లాలోని జలాశయాల్లోకి వరద వస్తుంది. ప్రస్తుతం అక్కడా భారీ వర్షాలు లేకపోవడంతో జిల్లాకు ఇంకా వరద చేరడం లేదు.
కురుస్తున్న వాన..
జిల్లాలో మొన్నటి వరకు వాన కోసం రైతన్న ఎదురుచూశాడు. నాలుగు రోజులుగా వర్షం కురుస్తుండడంతో హర్షం వ్యక్తంచేస్తున్నారు. దాదాపు అన్ని మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తారుగా పడుతూనే ఉంది. జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు దస్తురాబాద్‌లో 33.6మి.మీ. వాన కురువగా, మిగితా మండలాల్లో 10 నుంచి 25 మి.మీ వరకు వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 12మి.మీ నమోదైంది.
ఎగువన పడితేనే..
జిల్లాలో వర్షం పడినా జలాశయాల్లోకి అనుకున్నంతగా నీరు చేరదు. ప్రాజెక్టులు నిండాలంటే ఎగున ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవాలి. నాసిక్, ఔరంగాబాద్, జాల్నా, పర్భణి, నాందేడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే ఎస్సారెస్పీకి వరద వస్తుంది. ఏటా నాసిక్ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం, గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరుసగా దిగువ ప్రాజెక్టులన్నీ నిండుతుంటాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జిల్లాలోని సుద్ధవాగు, స్వర్ణ, కడెం ప్రాజెక్టులతో పాటు సరిహద్దున గల ఎస్సారెస్పీ నిండాలన్నా.. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవాల్సిందే.
జులైలోనే అధికం..
జిల్లాలో రెండుమూడేళ్లుగా జులైలోనే వరద బీభత్సం సృష్టిస్తోంది. రెండేళ్లుగా కడెం ప్రాజెక్టు, పరివాహాక ప్రాంతాలు జలప్రళయాన్ని చవిచూస్తున్నాయి. ఊహకందని భారీ వరద ప్రాజెక్టును సైతం నిండా ముంచేస్తోంది. ఏ క్షణానైనా ఆనకట్ట తెగిపోతుందేమోనన్న ఉత్కంఠ నెలకొంటోంది. ఇక 2021లో వర్షంతోపాటు భారీ వరద బీభత్సం నిర్మల్ వణికించింది. స్వర్ణ నది వరద ప్రవాహం జీఎన్‌ఆర్ కాలనీనే ముంచేసింది. గత మూడేళ్లుగా ఎగువ నుంచి వస్తున్న వరద జిల్లాను ముంచెత్తుతోంది. ఈఏడాది ఇప్పుడిప్పుడే వర్షం జోరందుకుంటోంది. ఇప్పటికై తే వరద జాడ లేకపోవడంతో ప్రాజెక్టులకూ ఇంకా జలకళ రాలేదు.
కడెం ప్రాజెక్టులో గురువారం సాయంత్రం వరకు నీటిమట్టం
గోరింటాకు సంబురాలు
ఆషాఢమాసం నేపథ్యంలో జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం గోరింటాకు సంబురాలు నిర్వహించారు.
9లోu
న్యూస్‌రీల్
ప్రాజెక్టుల వివరాలు..
ప్రాజెక్టు పూర్తినీటిమట్టం ప్రస్తుతం ఆయకట్టు
(అడుగుల్లో) (ఎకరాల్లో)
కడెం 700 682.300 68,150
స్వర్ణ 1,183 1172.05 10,000
గడ్డెన్న 359 355.70 14,000
ఎస్సారెస్పీ 1,091 1065,80 35,000

వాన జోరు.. వరద లేటు!