
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కడెం: ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందని డీఈవో రామారావు అన్నారు. మండలంలోని రాంపూర్, మైసంపేట్ పునరావాస కాలనీ గిరిజనులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపే తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రైవేటు కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో వసతులున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చక్కని తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, రాగి జావా, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్‌లు, యూనిఫాం అందిస్తుమన్నారు. సమావేశంలో ఎంఈవో షేక్ హుస్సేన్, ఏఎంవో నర్సయ్య, టెక్ట్స్ బుక్స్ మేనేజర్ భానుమూర్తి, భూక్యరాజేశ్‌నాయక్, ఉపాధ్యాయులు దేవురావు, నిరో షా, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.