ఇన్‌స్పైర్‌.. పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పైర్‌.. పురస్కారం

Jul 3 2025 7:25 AM | Updated on Jul 3 2025 7:25 AM

ఇన్‌స

ఇన్‌స్పైర్‌.. పురస్కారం

నిర్మల్‌
పంటరుణాలకు ప్రదక్షిణలు
అటవీ ప్రాంత గిరిజనులు పాతికేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పంటరుణాలు ఇవ్వడంలేదు. పట్టాలున్నా బ్యాంక్‌ అధికారులు కనికరించడంలేదు.
● కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ● ప్రాజెక్ట్‌ ఎంపికై తే నగదు ప్రోత్సాహకం ● 6–10 తరగతుల వారికి అవకాశం

గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025

8లోu

సమర్థవంతంగా పని చేయాలి

భైంసాటౌన్‌: ప్రజలకు నాణ్యమైన సేవలందించేందుకు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. బుధవారం పట్టణంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. డివిజన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కరించాలని ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు సూచించారు. అనంతరం బ్లూ కోల్ట్స్‌ కానిస్టేబుళ్లు, 100 డయల్‌, ట్రాఫిక్‌ చలాన్ల జారీ, నైట్‌ పెట్రోలింగ్‌ చేసే పోలీస్‌ సిబ్బందికి ట్యాబ్‌లు, కెమెరాలు అందజేశారు. సీఐలు గోపీనాథ్‌, మల్లేశ్‌, ఎస్సైలు అశోక్‌, పెర్సిస్‌, అశోక్‌, శ్రీనివాస్‌, నవనీత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుప్రియ, హన్మాండ్లు, సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్మణచాంద: పాఠశాల దశ నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు మళ్లించి వారిని భావిశాస్త్రవేత్తలు గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వినూ త్న ఆలోచనలకు పదును పెట్టేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇన్‌స్పైర్‌ మనాక్‌ పేరిట పురస్కారాలు అందజేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, గురుకులా లు, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీల్లో చదివే విద్యార్థుల నుంచి ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 10–17 ఏళ్లుండి 6–10వ తరగతి చదువుతున్న ప్రతిభ కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందు కు అర్హులు. విద్యార్థులు తమ పాఠశాల సైన్స్‌ ఉపాధ్యాయుడి సహకారంతో దరఖాస్తు చేసుకోవచ్చు. గత నెల 15నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, సెప్టెంబర్‌ 15వరకు గడువు ఉంది. ఒక పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్ట్‌ల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

దరఖాస్తు విధానం ఇలా..

దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www. inspireawards& dst. gov. in వెబ్‌ సైట్‌లోకి వెళ్లి న్యూ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకుని సేవ్‌ చేయాలి. అనంతరం దరఖాస్తు జిల్లా అథారిటీకి వెళ్తుంది. జిల్లా అథారిటీ అధికారులు ఆమోదిస్తే విద్యార్థికి సంబంధించి పొందుపర్చిన మెయిల్‌ ఐడీతో కూడిన లింక్‌ వస్తుంది. అప్పుడు విద్యార్థి యూజర్‌ ఐడీకి పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అనంతరం విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. ప్రదర్శించాలనకుంటున్న ప్రాజెక్ట్‌ను సంక్షిప్తంగా వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయాలి.

ప్రాజెక్ట్‌ ఎంపికై తే అవార్డులు

ప్రాజెక్ట్‌లను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ప్రాజెక్ట్‌ ప్రదర్శనకు ఎంపికై తే దానిని రూపొందించిన విద్యార్థి బ్యాంక్‌ ఖాతాకు రూ.10వేలు జమ చేస్తారు. రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపికై తే రూ.25 వేలు, జాతీయ స్థాయికి ఎంపికై తే రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు నగదు పురస్కారం అందజేస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై తే సదరు విద్యార్థికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు. ప్రతిభావంతులకు ఐఐటీ, నీట్‌ ప్రవేశ పరీక్షల్లో రిజర్వేషన్‌ కూడా కల్పిస్తారు.

న్యూస్‌రీల్‌

జిల్లాలో 30మంది టీచర్లు

డీఈవో రామారావు ఆదేశాల మేరకు ఈసారి ప్రతీ మండలానికి ఇద్దరు చొప్పున ఇన్‌స్పైర్‌ ఇన్‌చార్జీలుగా ఉపాధ్యాయులను నియమించనున్నారు. ఇలా జిల్లాలో 30మందిని నియమిస్తారు. వీరు ప్రతీ పాఠశాల నుంచి ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా సాయపడతారని జిల్లా సైన్స్‌ అధికారి వినోద్‌కుమార్‌ తెలిపారు. వారితో ప్రాజెక్ట్‌లు తయారు చేయించి ప్రదర్శించేందుకు చొరవ చూపుతారని పేర్కొన్నారు.

జిల్లా నుంచి

ఎంపికై న ప్రాజెక్ట్‌లు

సంవత్సరం 2022–23 2024–24 2024–25

ప్రాజెక్ట్‌లు 118 126 119

ప్రతిభను వెలికితీసేందుకే..

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలి కితీయడానికే కేంద్ర ప్రభుత్వం ఇన్‌స్పైర్‌ మనాక్‌ పురస్కారాలు ఇస్తోంది. సమాజంలో అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు విద్యార్థులు ఆవిష్కరణలు తయారు చేయాలి. ఇందుకు పాఠశాలల సైన్స్‌ ఉపాధ్యాయులు తోడ్పాటునందించాలి. ఈ సంవత్సరం 1,200 మందితో దరఖాస్తు చేయించాలన్నదే లక్ష్యం.

– వినోద్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి

ఇన్‌స్పైర్‌.. పురస్కారం1
1/3

ఇన్‌స్పైర్‌.. పురస్కారం

ఇన్‌స్పైర్‌.. పురస్కారం2
2/3

ఇన్‌స్పైర్‌.. పురస్కారం

ఇన్‌స్పైర్‌.. పురస్కారం3
3/3

ఇన్‌స్పైర్‌.. పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement