
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
భైంసారూరల్: పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దూరమవుతాయని జిల్లా వైద్యాధికారి రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని వానల్‌పాడ్ గ్రామంలోగల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న బాలశక్తి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆరోగ్యం, అభివృద్ధి, ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి, క్షేత్ర పర్యటన తదితర అంశాలపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. విద్యార్థులు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, దీంతో ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రధానోపాధ్యాయుడు గంగాధర్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.