
పోడు రైతులపై కక్షసాధింపు సరికాదు
ఖానాపూర్: మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన పోడు రైతులపై అటవీ అధికారులు కక్ష సా ధింపునకు పాల్పడడం సరికాదని రైతు సంఘం రా ష్ట్ర కార్యదర్శి శోభన్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన పోడు రైతు బోసు భూమన్న పంట పొలాన్ని సందర్శించారు. కొన్నేళ్లుగా రైతు పోడు సాగు చేస్తున్నా అటవీ అధికారులు అందులో జేసీబీతో గుంతలు తవ్వడం సరికాదని పేర్కొన్నారు. చెరువు ఆయకట్టు భూమిలో సాగు నీ టి కోసం వేసిన పైపులైన్ కూడా ధ్వంసం చేయడంతో పాటు గట్టుపై ఉన్న మామిడి చెట్లను తొలగించ డం హేయమైన చర్య అని తెలిపారు. పోడు సాగుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికా రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మి క సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరి తిరుపతి, కార్యదర్శి నాగెల్లి నర్సయ్య తదితరులున్నారు.