
పవిత్రమైనది వైద్యవృతి
నిర్మల్‌ఖిల్లా: అన్ని వృత్తుల్లో వైద్యవృత్తి అత్యంత పవిత్రమైనదని, ఈ వృత్తిలో ఉన్నందుకు తామెంతో గర్విస్తున్నామని జిల్లా వైద్యులు అన్నారు. మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవనంలో డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు మాట్లాడుతూ.. సమాజంలో వైద్యవృత్తితోపాటు కళలు, సాహిత్యం, సామాజిక సేవ రంగాల్లో కూడా సేవలు అందిస్తున్న పలువురు వైద్యులు స్ఫూర్తినీయులని పేర్కొన్నారు. రోగులకు ప్రాణదాతలుగా నిలుస్తూ ఆదర్శనీయమైన వృత్తిలో కొనసాగుతున్న పలువురు వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.మురళీధర్, ఐఏపీ అధ్యక్షుడు అప్పాల చక్రధారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గోపాల్‌సింగ్, వైద్యులు సునీల్ రాథోడ్, బి.సురేష్, సుభాష్‌రావు, దామెర రాములు, రామకృష్ణ, వేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు..
టీడీఏ ఆధ్వర్యంలో...
తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులను సన్మానించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజేందర్, కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ అసోసియేషన్ సంఘానికి తమ తరఫున పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీఏ రాష్ట్ర కార్యదర్శి నేరేళ్ల హనుమంతు, జిల్లా అధ్యక్షుడు టి.సంతోష్‌కుమార్, టెక్నీషియన్లు ముత్యం, జ్ఞానేశ్వర్, రమణ, అనిల్, ధనుంజయ్, గంగాధర్, సాగర్ పాల్గొన్నారు.