
కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ చెల్లించాలి
నిర్మల్ రూరల్: జిల్లాలో గతేడాది నవంబర్‌లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని ఎస్టీయూ ప్రతినిధులు కోరారు. ఈమేరకు కలెక్టర్ అభిలాష అభినవ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు భూమన్నయాదవ్ మాట్లాడారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు రూ.10 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకో వాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారిని ఆదేశించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్, నాయకులు వెంకటేశ్వర్‌రావు, పరమేశ్వర్ ఉన్నారు.