
నిర్మల్
బాసరలో పోలీసుల మాక్ డ్రిల్
బాసర గోదావరి నదిలో ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు మాక్‌డ్రిల్ నిర్వహించారు. శివంగి, స్పెషల్ టీంలు సుమారు 2 గంటలు నదిలో మాక్ డ్రిల్ చేశారు.
10లోu
శుక్రవారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2025
డిగ్రీలో ప్రవేశాలు
సోన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, సోఫీ నగర్‌లో 2025 –26 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(బీజెడ్‌సీ), బీఎస్పీ(ఎంజెడ్‌సీ) ఎంఎస్‌సీఎస్, బీకాం, కంప్యూటర్, బీకాం జనరల్, బీఏ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి.కవిత తెలిపారు. కలెక్టర్ అభిలాష అభినవ్ కళాశాల ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారని తెలిపారు. పూర్తి వివరాలకు 9000599665, 9542556688 సంప్రదించాలని సూచించారు.
జిల్లాలో మద్యం, సిగరెట్‌లను దాటి యువత కొత్త మత్తుపదార్థాలకు బానిస అవుతోంది. గంజాయి ఒక్కటే సమస్య అనుకుంటే, ఇటీవల సరికొత్త మ త్తు రకాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెలలో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్–రే టెక్నీషియన్‌లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల్లో వాడే మిడాజోలం ఇంజెక్షన్‌లను యువతకు అక్రమంగా అందజేస్తూ పట్టుబడ్డారు. ఈ మందు అతిమాత్రలో ప్రాణాంతకం. ఇక, ఖానాపూర్‌లో ‘బాటిల్‌షాట్’ అనే కొత్త పద్ధతిలో యువకులు గంజాయి, బోనోఫిక్స్ మిశ్రమాన్ని బాటిల్‌లో రంధ్రం చేసి, పెన్ను మూత ద్వారా పీలుస్తున్నారు. ఈ ప్ర మాదకర అలవాటు గురించి తెలియకనే యువ త దీనికి బానిస అవుతోంది. వైట్‌నర్, దగ్గుమందుల ను కూడా మత్తుకోసం వాడుతున్నవారు ఉన్నారు, ఇది జిల్లా భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతోంది.
అధికారుల చొరవ.
‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ లక్ష్యంతో కలెక్టర్, ‘గాంజా గస్తీ’ కింద ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవగాహన కార్యక్రమాలు, పోలీసు దాడులు, కళాజాతలతో ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ, గంజాయి విక్రయాలు, మత్తు వాడకం తగ్గడం లేదు. జిల్లా కేంద్రం, శివారు ప్రాంతాల్లో ఈ దందా కొనసాగుతోంది.
ప్రత్యేక వ్యూహం
మత్తురహిత జిల్లా కోసం పోలీసు, అబ్కారీ శాఖలు, జిల్లా అధికారులు సమన్వయంతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో కమిటీలు ఏర్పాటు చేసి, గ్రామాల్లో అభివృద్ధి కమిటీల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలి. సమాచారం ఆధారంగా స్పందించే బదులు, మత్తుపదార్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలు అవసరం. యువతను ఈ ఉచ్చు నుంచి కాపాడేందుకు సమగ్ర విధానం తప్పనిసరి.
ఇటీవల ఖానాపూర్ శివారు ప్రాంతాల్లో లభ్యమైన బోనోఫిక్స్
న్యూస్‌రీల్
కొత్తకొత్త మత్తుల్లో...
జిల్లా డ్రగ్ ఫ్రీ చేస్తామంటున్న అధికారులు
కొత్త డ్రగ్స్ వినియోగిస్తున్న వ్యసనపరులు
చర్యలు చేపడుతున్నా.. ఆగని గంజాయి
‘డ్రగ్ ఫ్రీ నిర్మల్’ చేస్తామంటూ ఉన్నతాధికారులు చొరవ తీసుకున్నా.. జిల్లాలో మత్తుమందు వినియోగం ఏమాత్రం ఆగడం లేదు. పైపెచ్చు.. సరికొత్త మత్తులో యువత చిత్తవుతోంది. చాలాచోట్ల ఉదయం నుంచే గంజాయి మత్తులో జోగుతూ.. రోజంతా ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఉంటున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న రోడ్డుప్రమాదంలో ఓ యువకుడి మరణానికి కారణమైన మరో యువకుడు గంజాయి తాగి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. గతంలోనూ జిల్లాలో చాలామంది యువకులు ఇదేమత్తులో రోడ్డుప్రమాదాల బారిన పడి, తమ నిండుప్రాణాలను కోల్పోయారు. తమను కన్నతల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు. – నిర్మల్
మద్యం, సిగరెట్, గంజాయిని దాటేసి కొత్తకొత్త మత్తుల్లో యువత చిత్తవుతోంది. కొంతకాలంగా గంజాయి ఒక్కటే జిల్లాను కుదిపేస్తోందనుకుంటుంటే.. ఇటీవల సరికొత్త మత్తుపదార్థాల వాడకం వె లుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
గత నెలలో జిల్లాకేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో పనిచేసే ముగ్గురు ల్యాబ్/ఎక్స్‌రే టెక్నీషియన్‌లు, ఓ యువకుడు శస్త్రచికిత్సల సమయంలో పేషెంట్లకు ఇచ్చే మిడాజోలం అనే మత్తుమందు ఇంజెక్షన్‌లను యువతకు ఇస్తూ పట్టుబడ్డారు. ఈ మత్తు ఏమాత్రం ఎక్కువైనా ప్రాణాలకే ప్రమాదం.
తాజాగా ఖానాపూర్‌లో పలువురు యువకులు ‘బాటిల్‌షాట్’లకు అలవాటు పడటం కలవరం రేపుతోంది. ఒక బాటిల్‌లో గంజాయి, బోనోఫిక్స్ రెండు మిశ్రమంగా చేసి బాటిల్‌కి చిన్న రంధ్రం చేసి దానికి పెన్ను మూతను బిగించి గంజాయి, బోనోఫిక్స్ మిశ్రమాన్ని పీలుస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలియకుండానే పీల్చేస్తున్నారు.
వైట్‌నర్, దగ్గుమందులనూ మత్తుకోసం వాడుతున్నవారు ఉన్నారు. గంజాయితో పాటు ఇలా కొత్తకొత్త మత్తుల కోసం జిల్లా యువత పెడతోవలో పోతుండటం కలవరపెడుతోంది.

నిర్మల్