
త్యాగానికి ప్రతీక బక్రీద్
ప్రార్థన చేస్తున్న చిన్నారి
త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను శనివారం జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం ఈద్గాల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశం వినిపించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిత్రులు, బంధువులకు కుర్బానీ అందించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద వివిధ పార్టీల నాయకులు ముస్లింలను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈద్గాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును ఎస్పీ జానకీ షర్మిల, నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా, పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. – నిర్మల్ టౌన్