● వృద్ధాప్యం వచ్చినా దరిచేరని రోగాలు ● బయటి ఫుడ్డు తినకపోవడమే కారణం ● అన్ని వంటలు నేటికీ కట్టెలపొయ్యిపైనే ● ఇంటింటా మట్టి పాత్రల వినియోగం ● ఆదర్శంగా నిలుస్తున్న మిద్దెచింత గ్రామం
కడెం: మారిన ఆహారపు అలవాట్ల కారణంగా ఈరో జుల్లో 30 ఏళ్లకే బీపీ, షుగర్ రావడం కామన్ అయిపోయింది. కానీ.. ఏడు పదుల వయస్సు దాటినా వీరికి నేటికీ బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక రోగాలు దరి చేరలేదు. కనీసం కళ్లద్దాల అవసరం కూడా రా నీయకుండా హ్యాపీగా కాలం గడుపుతున్నారు. ఇందుకు కారణం వీరు బయటి ఆ హారం ముట్టరు. వారు పండించిన జొన్నలు, రాగులు, పప్పు దినుసులు, కూరగాయలనే ఆ హారంగా తీసుకుంటారు. దీంతో వారికి ఎలాంటి రోగాలు రావు. వృద్ధాప్యంలోనూ చలాకీగా ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తారు. ఎలాంటి రోగాలు దరి చేరనీయకుండా సంపూర్ణ ఆరోగ్యకర జీవితం గడుపుతున్న కడెం మండలంలోని మిద్దెచింత గ్రామస్తుల లైఫ్‌స్టైల్‌పై సండే స్పెషల్..
ప్రకృతి ఆహారమే ముద్దు
ప్రకృతిలో లభించే దుంపలు, ఆకుకూరలు, వేర్లను మిద్దెచింత వాసులు ఆహారంగా తీసుకుంటారు. ఈ మారుమూల ఆదివాసీ గ్రామానికి ఇప్పటికీ విద్యు త్ సౌకర్యం లేదు. ఆయిల్ ఇంజన్ల సాయంతో సా గునీరు అందిస్తూ వారికి కావాల్సిన అన్ని రకాల పంటలు పండిస్తారు. ఇప్ప పువ్వు, కంది కట్టెలను ఉడికించి జొన్న పిండితో బూరెలు చేసుకుని తిన డం వీరికి ఇష్టం. కంది పంట కోసిన తర్వాత ఇప్ప బూరెలు చేసుకునేందుకు కందికట్టెను ఏడాదంతా ఇళ్లలో నిల్వ చేసుకుంటారు. జొన్నరొట్టె, జొన్న, మక్క అంబలి, పెసర, మినుము, కంది, అనుములు వీరు పండించే ప్రధాన పంటలు. అడవిలో దొరికే కేస్కగడ్డ విషపూరితమైనదైనా దానిని ఏడుసార్లు ఉడికించి ఆహారంగా తీసుకుంటారు. కొబ్రాసీరు అనే వేర్లతో వీరు టీ చేసుకుని తాగుతారు. ఈ కారణంగానే ఎలాంటి రోగాలు తమ దరికి చేరవని గ్రామస్తులు చెబుతున్నారు. వారు పండించిన పంటలే ఆహారంగా తీసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కళ్లద్దాలు అవసరం లేదు
నాకు 82 ఏళ్లు. ఇప్పటివరకు బీపీ, షుగర్ రాలేదు. ఎలాంటి రోగాలూ లేవు. మా గ్రామంలో వృద్ధులెవరికీ నేటికీ కళ్లద్దాలు రాలేదు. మాకు కరెంట్ లేనందునా చీకటి పడకముందే ఆహారం తీసుకుంటాం. సమయానికి నిద్రపోతాం.
– ఆడ సోము
పాత తరాన్ని అనుసరిస్తున్నాం
మేము పాత తరాన్ని అనుసరిస్తున్నాం. చి న్నప్పటి నుంచి రసాయనాలు వేయని పంటలనే ఆహారంగా తీసుకుంటున్నాం. వ్యవసాయ పనుల్లో ముందుంటాం. కూరగాయలు, దినుసులు పండించి మార్కెట్‌లో విక్రయిస్తాం.
– ఆత్రం మానిక్‌రావు
నో బీపీ.. నో షుగర్
నో బీపీ.. నో షుగర్
నో బీపీ.. నో షుగర్
నో బీపీ.. నో షుగర్