
కరాటే బెల్ట్ గ్రేడ్ పరీక్షలు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని అమ్ముల భూ షణ్ కరాటే అకాడమీలో 30 రోజులుగా కరా టే నేర్చుకున్న విద్యార్థులకు శనివారం వాసవీ ప్రైమరీ పాఠశాలలో బెల్ట్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 50మంది విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు తేజేంద్రసింగ్ భాటియా, పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని, కరాటే అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, చిరంజీవి, వంశీ, మృణాళిని, వినయ్‌కుమార్, నక్షత్ర తదితరులు పాల్గొన్నారు.