
ఆత్మీయత చాటుకున్న అదనపు కలెక్టర్
నిర్మల్‌ఖిల్లా:సాధారణంగా ఐఏఎస్ అధికారి అంటేనే ఉన్నత ఉద్యోగం. తన వద్ద పనిచేసే ఓ చిరుద్యోగి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటే ఆ చిరుద్యోగికి కలిగే ఆనందమే వేరు. సరిగ్గా అలాంటి ఆనందమే అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తన వద్ద డ్రైవర్‌గా పనిచేసే మహమ్మద్ ఆరిఫ్‌కు అందించారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మహమ్మద్ ఆరిఫ్–యాస్మిన్ పర్వీన్ దంపతులకు శనివారం ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ఫైజాన్ అహ్మద్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి ఆరిఫ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లీబిడ్డల యోగక్షేమాలు తెలుసుకున్నారు. శిశువును కాసేపు ఎత్తుకున్నారు. దీంతో ఆ డ్రైవర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.