
మైనర్లకు వాహనాలు ఇస్తే.. ఓనర్లపై కేసు
● నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా
నిర్మల్‌టౌన్: మైనర్లకు వాహనాలు ఇస్తే ఓనర్లపై కేసు నమోదు చేస్తామని నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలో మైనర్ డ్రైవింగ్‌పై శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 10 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. దానికి పూర్తి బాధ్యత యజమానులు వహించాల్సి ఉంటుందన్నారు. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ఉండడంతో తల్లిదండ్రులు పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చట్టప్రకారం కేసును నమోదు చేయడం జరుగుతుందన్నారు. కొద్దిరోజులుగా మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ.. పోలీస్ తనిఖీల్లో పట్టుబడుతున్నారని తెలిపారు. పట్టుబడిన వారికి జరిమానాలు విధిస్తూ.. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కేసులు నమోదు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం వలన ఆ జాగ్రత్తగా అతివేగంతో వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు కారణం అవుతారని తెలిపారు. ఏఎస్పీ వెంట పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.