
సైనికులకు సంఘీభావం
నిర్మల్‌చైన్‌గేట్: పహల్గాంలో హిందువులపై ఉ గ్రవాదులు జరిపిన దాడికి ప్రతీకారంగా భార త సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి పలువురు ఉగ్రవాదులను మట్టుపెట్టి న త్రివిధ దళాల సైనికులకు జిల్లా వాసులు సంఘీభావం తెలుపుతున్నారు. పట్టణంలోని స్థానిక నాయిడివాడ వార్డ్ నంబర్ 2లో తాజా మాజీ కౌన్సిలర్ సాదం స్వప్న అరవింద్ , గల్లీ పెద్దల ఆధ్వర్యంలో స్థానిక సంజీవని హనుమా న్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. భారత సైనికులకు ధైర్య స్థైర్యం, శక్తి, యు క్తులను అందించి అండగా ఉండాలని హనుమాన్‌ను వేడుకున్నారు. కాలనీవాసులు కోర్టికంటి లింగన్న, గజ్జ పోశెట్టి, నాయిడి రమేశ్, రాంమహేశ్, దుబ్బ నారాయణ, లక్ష్మణ్, కూన రాములు, సుదర్శన్, రామ్‌మల్లేశ్, సాయినాథ్, పొలస భరత్, ఏపూరి ప్రమోద్ పాల్గొన్నారు.