
పెద్దమ్మతల్లికి బోనాలు
మామడలో బోనాలతో మహిళలు
మామడ/ఖానాపూర్: మామడ మండలంలోని అనంతపేట్‌లో ఆదివారం పెద్దమ్మతల్లికి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలతో ఆలయం వరకు శోభాయాత్రగా తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీరప్ప కమరాతి కల్యాణోత్సవంలో భాగంగా ఖానాపూర్ మండలంలోని బావాపూర్ బీరప్ప ఆలయంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజంతా బియ్యం సుంకు పట్టుట, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బావాపూర్(కె) కుర్మ సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌లో సుంకు పడుతున్న భక్తులు

పెద్దమ్మతల్లికి బోనాలు