
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. వేడి, ఉక్కపోత తగ్గుతుంది. సాయంత్రం ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు
నిర్మల్‌చైన్‌గేట్: భూభారతి నూతన రెవెన్యూ చట్టం అమలులో భాగంగా కుంటాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని 16 గ్రామాల్లో ఈ నెల 5నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు మూడు ప్రత్యేక బృందాలను నియమించామని, భూములకు సంబంధించిన సమస్యలు, పాత రికార్డుల సమస్యలు, పేరుమార్పులు వంటి అంశాలను స్థానిక ప్రజలు ఈ సదస్సుల్లో దరఖాస్తుల రూపంలో ఇవ్వవచ్చన్నారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. జూన్ 2వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద అందిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని, అవసరమైన కార్యాచరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. భూభారతి అమలుతో ప్రజలకు తక్షణ సత్వర సేవలు అందేలా చర్యలు చేపడతామన్నారు.