
తాత్విక ధోరణితో సమున్నత జీవితం
● ’జీవితమే ఒకపుస్తకం’ గ్రంథ పరిచయ కార్యక్రమంలో సాహితీవేత్తలు ● జిడ్డు కృష్ణమూర్తి ఆంగ్ల పుస్తకాన్ని అనువదించిన జిల్లా కవి
నిర్మల్‌ఖిల్లా: తాత్విక ధోరణి ద్వారానే సమున్నత జీవితం సిద్ధిస్తుందని జిల్లాకు చెందిన పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు. జిల్లాకేంద్రంలోని కావేరి ఫౌండేషన్ గ్రంథాలయంలో మంగళవారం రాత్రి ‘జీవితమే ఒక పుస్తకం’గ్రంథ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అనువాదకర్త కె.మచ్చేందర్..ప్రపంచ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల సమాహార గ్రంథం ‘ది బుక్ ఆఫ్ లైఫ్’అనే ఆంగ్ల పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. కార్యక్రమంలో పాల్గొన్న సాహితీవేత్తలు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాటు కష్టపడి ఈ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించడం ప్రశంసనీయమని కొనియాడారు. కావేరి ఫౌండేషన్ చైర్మన్ అప్పాల చక్రధారి, సాహితీవేత్తలు టి.సంపత్ కుమార్, నరసయ్య, రవీంద్రబాబు, తుమ్మల దేవరావు, కృష్ణంరాజు, మునిమడుగుల రాజారావు, ఆకుల సుదర్శన్, అంబటి నారాయణ, అనిత, నాగరంజని, నూకల విజయ్‌కుమార్, దీపక్, పోలీస్ భీమేశ్ తదితరులు పాల్గొన్నారు.